“Yuvagalam at Peeleru Continues to Surpass Milestones with Latest Achievement”
పీలేరులో హోరెత్తిన జనసంద్రం! పాదయాత్రలో పాల్గొన్న కన్నా, ధూళిపాళ్ల యువగళాన్ని అడ్డుకునేందుకు వైసిపి ముష్కరుల యత్నం పాదయాత్ర సమయంలో పీలేరులో పవర్ కట్
పీలేరు: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో పోరాటమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. జ్యోతినగర్ విడిది కేంద్రంవద్ద నుంచి 35వరోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆకస్మికంగా కన్నుమూసిన ప్రత్తిపాడు నియోజకవర్గ TDP ఇన్ చార్జి వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. పీలేరు బహిరంగసభ అనంతరం పట్టణంలో నిర్వహించిన పాదయాత్రకు జనం నీరాజనాలు పలికారు. ప్రధాన రహదార్లవెంట జనం కిక్కిరిసిపోవడంతో పీలేరు పట్టణం జనసంద్రంగా మారింది. యువగళం పాదయాత్ర 35వరోజు (ఆదివారం) ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. నారా లోకేష్‌ని చూసేందుకు రోడ్లవెంట మహిళలు, యువకులు పోటెత్తారు. అడుగుతీసి అడుగు వేయలేనంతగా జనం రోడ్లపైకి చేరుకున్నారు. పీలేరు పట్టణంలో యువనేతపై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో పీలేరు హోరెత్తిపోయింది. జ్యోతినగర్ విడిది కేంద్రం నుండి ప్రారంభమైన 35 వ రోజు యువగళం అగ్రహారం క్రాస్ వద్ద యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో ప్రవేశించింది. పీలేరు ప్రజలు, పార్టీకార్యకర్తలు, అభిమానులు యువనేతకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టిడిపి నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు. పీలేరు మార్కెట్ యార్డు వద్దకు యువగళం పాదయాత్ర చేరుకునే సమయానికి మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గిరిధర్ నాథ్ రెడ్డి తన అనుచరులతో వైసిపి జెండాలు పట్టుకుని టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడటంతో పారిపోయి మార్కెట్ యార్డులో దాక్కున్నారు. పీలేరు మెయిన్ రోడ్డుపై పాదయాత్ర కొనసాగుతుండగా టపాసులు కాల్చుతున్న సమయంలో సిఐ ఎన్ మోహన్ రెడ్డి కార్యకర్త కాలర్ పట్టుకుని పోలీసు జీపులోకి విసిరేశారు. టిడిపి కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా టిడిపి కార్యకర్తలు చుట్టుముట్టి నినాదాలు చేయడంతో వదిలివేశారు. యువనేత పీలేరు రైల్వేస్టేషన్ వద్ద నుంచి విడిది కేంద్రం వరకు సుమారు రెండుకిలోమీటర్లు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వేలాది ప్రజల నీరాజనాల నడుమ రాత్రి 8.30గంటలప్రాంతంలో పీలేరు శివారులోని విడిది కేంద్రానికి పాదయాత్ర చేరుకుంది.