yuvagalam continues to Make Strides Towards Success.
పీలేరులో రెండోరోజూ యువనేత నీరాజనాలు యువనేతను కలిసిన సీనియర్ నేత కంభంపాటి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పార్టీలో చేరికలు
పీలేరు: టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 36వ రోజు (సోమవారం) పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో కొనసాగింది. పీలేరు నియోజకవర్గంలో వరుసగా రెండోరోజుకూడా యువనేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పీలేరు మండలం వేపులబయలు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పెదబయలులో బిసిలతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. అయ్యవారిపల్లివద్ద మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. శివపురం వద్ద గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. శివపురం అంకాళమ్మ గుడివద్ద సగర సామాజికవర్గీయులు యువనేతను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తిమ్మిరెడ్డిగారిపల్లి,భోయపల్లిలో స్థానికులు యువనేతకకు ఘనస్వాగతం పలికారు. ఎల్లంపల్లి గ్రామప్రజలు యువనేతను పుష్పగుచ్చాలతో స్వాగతించారు. చింతలవారిపల్లి గ్రామప్రజలు పెద్దఎత్తున యువనేతకు హారతులుపట్టారు. కొర్లకుంటలో యువకులు కేరింతలు కొడుతూ యువనేతకు నీరాజనాలు పలికారు. సత్యాపురం, కొర్లకుంట గ్రామప్రజలు హారతులిచ్చారు. మండల కేంద్రం కలికిరిలో యువనేతకు స్థానిక ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు జనం ముఖ్యంగా యువతీయువకులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. మహిళలు, యువత, వృద్ధులను కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారంతో బతుకు భారం గా మారిందని లోకేష్ ఎదుట మహిళలు వాపోయారు. కలికిరి ఇందిరమ్మ నగర్ వాసులు యువనేతను హారతులిచ్చి స్వాగతించారు. నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో వైసిపి నాయకుడు, కలికిరి సర్పంచ్ ఆర్ ప్రతాప్ రెడ్డి, మహాల్ మాజీ సర్పంచ్ వై. సతీష్ రెడ్డి, ఎనుగొండపాలెం మాజీ ఎంపిటిసి ఏ. శ్రీనివాసుల నాయుడులతో సహా 1500 కుటుంబాలు యువనేత సమక్షంలో టిడిపిలో చేరాయి. యువనేత వారిని పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.